తెలంగాణలో ఆసుపత్రులు వైద్య సిబ్బంధి రొగులు చనిపోక ముందు నిర్లక్ష్యమే వహిస్తున్నారు, చనిపోయిన తరువాత కూడా నిర్లక్ష్యమే వహిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన చూస్తే ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. కరోనా వచ్చిన రోగుల దహనం చేస్తున్న అధికారులు పూర్తిగా దహనం అవ్వకముందే వదిలేసి వెళ్లిపోతున్నారు దాంతో అక్కడి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఈఎస్ఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ఇలా కుక్కలు శవాలను పీక్కుతినడం అక్కడి స్థానికులు గమనించారు వారు వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.
ఈఎస్ఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికలోకి అధికారులు కరోనా సోకి మరణించిన వారి మృతదేహాలను తీసుకువస్తున్నారు. ప్రతీ రోజు 18 నుండి 20 శవాలు అక్కడ దహనం చేస్తున్నారని అక్కడి కాటి కాపరి చెబుతున్నాడు. అయితే అధికారులు అర్థరాత్రుల్లో శవాలను అక్కడకు తీసుకువచ్చి ఎలక్ట్రిక్ దహనం చేస్తున్నారు కానీ అక్కడ ఆ పరికరాలు సరిగ్గా పనిచేయకపోయేసరికి కర్రలపై దహనం చేస్తున్నారు. కాటికాపరులను కాల్చనివ్వకుండా ఆ పనిని జీహెచ్ఎంసీ వారే స్వయానా చేస్తున్నారు. దాంతో మృతదేహాలు సరిగ్గా కాలడం లేదు. మృత దేహాలు సరిగ్గా కాలకపోయేసరికి అక్కడి కుక్కలు ఆయా కరోనా మృతదేహాల వీడి భాగాలను పీక్కుతింటున్నాయి.