అమరావతి: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు ఆలస్యంగా స్పందించారు. తనపై నెపం మోపడం వల్లే జగన్‌ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో జరిగిన దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏమిటీ సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేస్తారని, బీజేపీ నన్ను ఏ-వన్ అంటుందని ఆరోపించారు. దాడి చేస్తే జగన్‌పై సానుభూతి వస్తుందని భావించానని నిందితుడే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. బై ఎలక్షన్ వచ్చుంటే వైసీపీ ఎంపీ స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకునేదని జోస్యం చెప్పారు.