పార్టీలు కావాలంటే సర్వే ఫలితాలు ఇస్తా…లగడపాటి

-

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో ఎన్నికల సర్వేను డిసెంబర్ 7 తర్వాత ప్రకటిస్తానని తెలిపారు.  గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… పార్టీలు తమ సర్వేఫలితాలు కావాలనుకుంటే వారికి అందజేస్తానన్నారు. తెదేపా – కాంగ్రెస్ పొత్తులపై మీడియా ప్రశ్నించగా సీట్ల పంపకం అయిన తర్వాత గెలుపు గురించి క్లారిటీ వస్తోందని ఆయన తెలిపారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పర్యటించినప్పుడు.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ వినిపించిందన్నారు రాజగోపాల్. మెదక్ ప్రజలు తనను ఎన్నికల్లో పోటీ చేయమని అడిగారని చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే తప్పకుండా తెలంగాణ నుంచి పోటీ చేస్తానని వివరించారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం కారణంగా ఆయన  గతంలో కూడా జాతీయ స్థాయిలో పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చారని గుర్తు చేశారు. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని.. అందులో తప్పేముందన్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య వస్తున్న వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news