‘బిగ్ బీ అమితాబ్’ ఫ్యామిలీకి కరోనా షాక్!

-

కరోనా వైరస్.. ఈ వైరస్ కు పేద ధనిక పెద్ద చిన్న అని తేడా లేదు. సీఎం అయినా పీఎం అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా వైరస్ భారిన పడక తప్పదు. ఇంకా ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కూ కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

amitabh abhishek bachchan tested corona positive
amitabh abhishek bachchan tested corona positive

అమితాబచ్చన్ శనివారం రాత్రి ట్విట్ చేస్తూ.. ”నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న.” అంటూ ట్విట్ చేశారు.

ఇలా బిగ్ బి ట్విట్ చేసిన మరికొన్ని నిమిషాలకే అభిషేక్ బచ్చన్ కూడా ఇలా ట్విట్ చేశారు..”నాన్నకు, నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇద్దరికీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ ఈ సమాచారాన్ని అందించాం. అలాగే మా కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు సైతం కరోనా పరీక్షలు చేయించాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ అభిషేక్ బచ్చన్ ట్విట్ చేశారు.

కాగా కరోనా వైరస్ బిగ్ బి ఫ్యామిలీని అటాక్ చెయ్యడం బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం షాక్ అయ్యింది. అందుకే ఈ కరోనా కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుంటే ఎవరైనా కరోనా వైరస్ భారిన పడక తప్పదు అని రుజువు చేసింది బిగ్ బి ఫ్యామిలి.

Read more RELATED
Recommended to you

Latest news