నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో 100 కోట్ల బడ్జెట్ తో సినిమా ఉంటుందని ఈమధ్య వార్తలు వచ్చాయి. బోయపాటి, బాలయ్య సింహా, లెజెండ్ తర్వాత కలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. అయితే రీసెంట్ గా వినాయక్ తో కూడా బాలకృష్ణ సినిమా ఉంటుందని న్యూస్ బయటకు వచ్చింది.
వినాయక్ సినిమాపై ఈమధ్య డిస్కషన్ లేకున్నా బాలకృష్ణ వినాయక్ తో కూడా సినిమా చేసేందుకు సై అన్నాడని లేటెస్ట్ న్యూస్. సి. కళ్యాణ్ నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. చెన్నకేశవ రెడ్డి తర్వాత వినాయక్ డైరక్షన్ లో బాలకృష్ణ చేస్తున్న మూవీ కావడంతో రాబోయే సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఎన్.టి.ఆర్ బయోపిక్ పూర్తి కాగానే బోయపాటి, వినాయక్ రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడట బాలకృష్ణ. మరి చూస్తుంటే 2019 నందమూరి ఫ్యాన్స్ కు మరింత పండుగే అని చెప్పొచ్చు.