టెన్షన్ : ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరారీ..!

-

ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డ్ నుంచి సోమవారం కరోనా పాజిటివ్ బాధితురాలు తప్పించుకుంది. మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో తన ఇంటి వద్దకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం అందించడంతో 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చున్నారు. అసలు బాధితురాలు పారిపోతుంటే.. ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు గ్రామస్తులు.

ఏదైనా జరగరానిది జరుగుంటే ఎంతో మంది దీని బారిన పడేవారని.. ఇది ముమ్మాటికి సిబ్బంది నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సోమవారం కొత్తగా 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 926 మంది కరోనా బారిన పడ్డారు. ఇవాళ 1,197 మంది డిశ్చార్జి అవగా.. మరో 9 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకొని 23,679 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,178 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news