WHO హెచ్చరిక.. భవిషత్తులో మరింత ప్రమాదం..!

-

ప్రపంచ దేశాలు కఠిన ఆరోగ్య చర్యలు తీసుకోకపోతే కరోనా వల్ల ఎదురయ్యే సమస్యలు భవిష్యత్తులో మరింత తీవ్రం కానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. చాలా దేశాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయన్న WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆంధమ్.. ప్రపంచానికి ఈ వైరస్సే ప్రధాన శత్రువు అవుతుందన్నారు. ఇప్పట్లో ఇదివరకటి రోజులు రాకపోవచ్చని, వైరస్‌ని కంట్రోల్ చేయడమే మన ముందున్న విధి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 2లక్షల 30వేల కేసుల్లో.. 80శాతం కేసులు 10 దేశాల నుంచి నమోదవగా, 50శాతం కేసులు రెండు దేశాల నుంచి నమోదైనట్టు WHO చీఫ్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దారి తర్వాత బ్రెజిల్ ఉంది. త్వరలోనే మళ్లీ పాత రోజులు, పరిస్థితులు నెలకొంటాయని అనుకోవడం అవివేకం అవుతుంది, చాలా విషయాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని WHO చీఫ్ అన్నారు. కాగా, WHO నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అయితే చేశాడు కానీ, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆథమ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news