కరోనా కట్టడికి తొలి వ్యాక్సిన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ప్రోత్సాహకర ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. శరీరంలో యాంటీ బాడీలను పెంచడంతో పాటు కరోనా కణాలను హతమార్చే ‘టీ-సెల్స్’ శరీరంలో ఉత్పత్తి అయ్యేలా వ్యాక్సిన్ ప్రేరేపిస్తోందని, తమ ప్రయోగాల్లో ‘టీ-సెల్స్’ అత్యంత కీలకాంశమని అన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించిన బెర్క్‌షైర్ పరిశోధక నైతిక విలువల కమిటీ ఛైర్మన్ డేవిడ్ కార్పెంటర్ మాట్లాడుతూ..
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ సరైన దిశలో సాగుతుందని అన్నారు. అయితే ఎప్పటిలోగా ఇది వస్తుందనేది ఎవరూ చెప్పలేరని, కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు ఎదురుకావొచ్చన్నారు. అయితే అతిపెద్ద ఔషధ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని, ఈ లక్ష్యం దిశగానే ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని డేవిడ్ వ్యాఖ్యానించారు.