వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లీసాన్నే తన కొడుకును తీసుకొని జింబాంబ్యే సఫారీ అడవుల్లో పర్యటిస్తూ జంతువుల ఫోటోలను తన కెమెరాలో బంధిస్తున్న సమయంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఆరో టన్నుల బరువు గల అతిపెద్ద ఆఫ్రికా ఏనుగు వద్దకు లీసాన్నే యొక్క నాలుగేళ్ల కుమారుడు వెళ్లి దాని తొండాన్ని తాకి హాయ్ చెప్పాడు. ఆ ఏనుగు కింద ఈ పిల్లోడు ఓ చిన్న పిచుక లాగా కనిపించాడు. ఫోటోగ్రాఫర్ తన కుమారుడు ఏనుగు దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడియో చిత్రీకరించారు. “దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆ ఏనుగు చాలా ప్రశాంతంగా ఉంది”, అని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనడం వీడియోలో రికార్డు అయ్యింది.
నిజానికి ఆఫ్రికా ఏనుగులు చాలా ఎత్తు, బరువు ఉండటంతో పాటు చాలా కౄరంగా ఉంటాయి. మనుషుల కనిపించగానే వారి వెంబడి పడి చంపుతుంటాయి. సఫారీలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఏనుగులకు ఆమడ దూరంగా ఉంటారు. ఆఫ్రికన్ ఏనుగులు చాలా కోపం గా ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి ఆఫ్రికా ఏనుగు వద్దకు ఈ నాలుగేళ్ల బాలుడు వెళ్లడం… ఆ ఏనుగు అతడిని ఏమీ చేయకపోవడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం బాలుడు తల్లిదండ్రులను బాగా తిడుతున్నారు. కౄర జంతువుల వద్దకు పిల్లలను పంపించడం చాలా ప్రమాదకరమని మరికొంత మంది నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.