తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని తెలంగాణ పోలీశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర బలగాలతో కాకుండా రాష్ట్ర పోలీసులతోనే 4+4 గన్ మెన్లను, ఎస్కార్ట్ లతో భద్రత కల్పించాలని నిర్ణయించి ఈ మేరకు సిబ్బందిని పోలీసు శాఖ రేవంత్ ఇంటికి పంపింది. గత కొద్ది రోజుల క్రితం తనకు ప్రాణ హాని ఉందంటూ.. రేవంత్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు కేంద్రం ద్వారా భద్రత కల్పించాలంటే వారి ఖర్చులను రేవంత్ రెడ్డి భరించాలని సూచించింది. ఈ ప్రక్రియ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఫోర్స్ తో భద్రత కల్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో తనకు భద్రత కల్పించాలని ఎన్నిసార్లు పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో రేవంత్ కోర్టుని ఆశ్రయించారు.