నోరెళ్లబెట్టడం కాదు.. వాళ్లు తేరుకోవడానికి ఓ సోడా బాటిల్ తీసుకురావాల్సి వచ్చింది. అవును మరి.. షాక్ నుంచి ఇంకా వాళ్లు తేరుకోలేకపోతున్నారంటే. ఎహె.. అసలు ఏమైందో చెప్పండి అంటారా? మీరు కూడా నోరెళ్లబెడతరు అసలేంజరిగిందో చెబితే.
అది నారాయణగూడ. గ్లామర్ బైక్ దూసుకొస్తోంది. దాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు.. బండి ఆపారు. మనోడు హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో ఫైన్ వేద్దామని మిషిన్ తీశారు. బండి నెంబర్ టైప్ చేశారు. అంతే.. నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. మనోడి పెండింగ్ చలాన్లు 135 ఉన్నాయి. మనోడు మొత్తం ఫైన్ 31,455 రూపాయలు కట్టాలి. అంటే మనోడి ఇన్ని చలాన్లు పెండింగ్‌లో ఉన్నా.. దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాడని.. పోలీసులు నోరెళ్లబెట్టారు. వామ్మో.. వామ్మో.. మా కళ్లు గప్పి ఎన్నాళ్ల నుంచి తిరుగుతున్నావురా. ఇప్పుడు భలే దొరికావురా అని మనోడి బండిని సీజ్ చేసి ఆ బండి ఓనర్ మీద కేసు నమోదు చేశారు. 135 చలాన్లలో ఎక్కువగా సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగే ఎక్కువగా ఉన్నాయట. వీడి తెలివి తెల్లార…