శృంగార తార షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో లేడీస్ నాట్ ఎలౌడ్ చిత్రం జులై 20వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో www.ladiesnotallowed.com వెబ్ సైట్ లో రిలీజ్ అవ్వనుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా చూసేందుకు 50 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే డిజిటల్ సినిమా రిలీజ్ ట్రెండ్ ని రామ్ గోపాల్ వర్మ ప్రారంభించాడు. అతడు క్లైమాక్స్ సినిమాని వంద రూపాయలకు, నగ్నం చిత్రాన్ని రెండు వందల రూపాయలకు శ్రేయస్ ఈటీ యాప్ లో విడుదల చేశాడు.
ఆర్జీవి వరల్డ్ థియేటర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలు విడుదలకై ప్రారంభించాడు. అయితే ఇదే బాటలో షకీలా కూడా www.ladiesnotallowed.com వెబ్ సైట్ ని ఓపెన్ చేసి తన తదుపరి చిత్రాన్ని 50 రూపాయల టికెట్ పెట్టి ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం చాలా అప్పులు తెచ్చానని మగవాళ్ళంతా కచ్చితంగా ఈ సినిమా చూసి తనని ఆదుకోవాలని షకీలా విజ్ఞప్తి చేస్తుంది. మరి రామ్ గోపాల్ వర్మ సినిమాలను బుక్ చేసుకున్నట్టు షకీలా అడల్ట్ మూవీ ” లేడీస్ నాట్ అలవ్డ్” ని బుక్ చేసుకుంటారు లేదో చూడాలి.