రాములమ్మ ఫైర్.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ఫెయిల్.. !

-

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘‘గత కొద్ది రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కరోనా బాధితులను కాపాడటంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రధానమైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లోని పరిణామాలే ఇందుకు సాక్ష్యం. గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వాళ్ళను భయభ్రాంతుల్ని చేశారు. ఆక్సిజన్ లేక మరో కరోనా బాధితుడి ప్రాణం పోయింది.’’

అలాగే ‘‘ఇక ఉస్మానియా ఆస్పత్రి మురికినీళ్ళ పాలై నరకాన్ని తలపించింది. ఇక నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవు. మరోవైపు ఔట్‌సోర్సింగ్ నర్సులు, వార్డ్ బాయ్స్, 4వ తరగతి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేసే పరిస్థితి కల్పించారు. ఈ సమ్మెను ఆపించడానికి ప్రభుత్వం రోజుల తరబడి సమయం తీసుకుంది. ఇదంతా చూస్తుంటే కరోనాను కట్టడి చెయ్యడంలో కేసీఆర్ దొరగారి సర్కారు గాడితప్పి పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు దేవుడే దిక్కు అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మత్తు నిద్రపోతోంది.’’ అంటూ ఆమె తన ట్విట్టర్ లో వరుస పెట్టి ట్వీట్లు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news