ఆర్.ఆర్.ఆర్. రివర్స్ గేర్… హుందాగా లేదంటున్నారు!!

-

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి పార్టీ వరుసబెట్టి ఝలక్ లు ఇస్తుంది! పార్టీ ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే… ఆర్.ఆర్.ఆర్. మాత్రం పాడిందే పాడరా.. పాచిపళ్ల దాచరా అన్నట్లు మంకుపట్టుతో ముందుకు పోతున్నారు. “బీజేపీకి తాను అతి సమీపం” అనే ముద్ర బలంగా పెంచుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిచారు.

అయితే రఘురాముడు నడ్డాలి కలిశారో లేదో వైసీపీకి ఆ వార్త తెలిసిపోయింది! అందులో ఏం జరిగిందే కూడా తెలిసిపోయింది. నడ్డా వద్ద… రఘురాముడి సామర్థ్యంపై ఓ పరీక్ష పెట్టినట్లు టాక్ నడిచింది. అదేమంటే… ముందు నువు పోయి రాజీనామా చేసి పార్టీ తరఫున గెలిచిన ఆ తర్వాత రావయ్యా రాముడూ అన్నారంట! అక్కడే రఘురాముడి గొంతులో బాంబు పెట్టినట్లైంది. అది కక్కలేక.. మింగలేక గమ్మున వచ్చారని… వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తుంది.

అయితే ఒకవేళ ఆర్.ఆర్.అర్. ఇప్పుడు గానీ… రాజీనామా చేస్తే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తును తానే అంతమొందించుకున్నట్లు అవుతుందని కూడా టాక్ నడుస్తోంది. అలాగే… ఇన్నాళ్లు తన పార్టీ వ్యతిరేక ఛానళ్లులో వాపోయిన ఆర్.ఆర్.ఆర్. ను మామూలుగా వదిలిపెడితే కుదరదని కూడా వైసీపీ స్కెచ్ వేసింది! ట్రిపుల్ ఆర్ పై వేటు మామూలుగా ఉండకూడదు అంటూ టార్గెట్ చేస్తుంది! అందులో భాగంగా మొదట పార్లమెంట్ లో తన సీట్ ను లాస్ట్ బెంచీకి మార్చింది. ఆ తర్వతా పార్లమెంటరీ పార్టీ సబార్టినేట్ గా ఉన్న హోదాను కత్తిరించే పనిలో పడింది. మహా అయితే అది మరో రెండు నెలలో ఉంది. అయినా కానీ.. ఆ లోపే బలవంతంగా దించేందుకు పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది.

చాన్నాళ్లనుంచి చానళ్లలో పార్టీ పరువును వెటకారంగా తీస్తున్న రఘురాముడికి అసలు కిక్కు ముందు ముందు ఉంటోందని.. తనకంటే పార్టీ మంకుపట్టు మీద ఉందని కూడా టాక్ వినిపిస్తోందంట. మరి ఆర్.ఆర్.ఆర్. పొజిషన్స్ ఒక్కొక్కటి జారుతుండటంతో ఆయన ఇక రేపో మాపో రాజ్‌నాథ్ సింగ్‌ ను కూడా కలిసి తన మొర్ను ఆలకించాలని కోరనున్నట్లు టాక్.

ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో శాంతిభద్రతల సంగతి తనకు తెలియదు.. కానీ, నాకు మాత్రం భద్రత లేద‌ని అన్నారు. అయితే మా వాళ్లు పార్టీ నుంచి వెలేశారని.. తాను మాత్రం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వదిలి వెళ్ల‌ను.. పార్టీకి, ముఖ్యమంత్రికి విధేయుడిని అని స్ప‌ష్టం చేశారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌లో నా స్థానం మార్చుకోగలరు… కానీ, ఏమీ చేయలేరు అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో తన స్థానం మార్చడం వల్ల తనను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లార‌ని కూడా అన్నారు.

అలాగే.. అనర్హత పిటిషన్ సాధ్యం కాదని.. కాబట్టి పార్లమెంట్ ‌లో సీటు మార్చి సంతోషపడాలని చూస్తున్నారంటూ సెటైర్ కూడా పేల్చారు. సీటు మార్చడం వల్ల తనకు నష్టం లేదని… చివరి వరుసలో సీటు ఇచ్చినా నష్టం లేద‌ని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. పార్లమెంటులో మంచి పనితీరు కనబరచడమే.. తన పాలిట శాపంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌ తన శ‌క్తిమేర‌కు ప్రజాసమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాన‌ని అనడమే కాకుండా జులై 21వ తేదీన రాష్ట్రపతిని కలిసి, తన భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని వివ‌రిస్తాన‌ని అన్నారు. తన దిష్టిబొమ్మను కాల్చి.. తనను కాల్చేస్తామని బెదిరించిన వారి దిష్టిబొమ్మలను కాల్చాననే తనపే కేసులు పెట్టారంటూ ఆర్.ఆర్.ఆర్. ఆవేద‌న వ్య‌క్తం చేయడం చూపరుల గుండె తరుక్కుపోయేలా చేస్తున్నారనే కామెంట్లు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news