స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా ఇది మీకోసమే..!

-

మీ దగ్గర ఎస్ బీఐ డెబిట్ కార్డు ఉందా.. మీరు ఆ కార్డును ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు కార్డుకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంవేంటో మీరే చూడండి.భారత దేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తన వినియోగదారుల కోసం రకరకాల సర్వీసులను అందిస్తోంది. వీటిలో ఏటీఎం కార్డు సేవలు కూడా ఒకటి. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం 7 రకాల డెబిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డు ప్రాధాన్యతను బట్టి ప్రయోజనాలు మారుతూ ఉంటాయని ఎస్బీఐ పేర్కొంది.

debit card
debit card

స్టేట్ బ్యాంక్ అందించే డెబిట్ కార్డుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇందులో కార్డు రకాలు.. రోజు వారి విత్ డ్రా లిమిట్ ను పొందుపర్చడం జరిగింది. ఎస్ బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు రోజుకు ఏకంగా రూ. లక్ష వరకూ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ఈ కార్డుకు రూ.100 చెల్లించాలని, ప్రతి ఏడాది రూ.175 కడుతూ రావాలని ఎస్ బీఐ పేర్కొంది.

ఎస్ బీఐ ముంబయి మెట్రో కాంబో కార్డు ద్వారా రూ.40,000 డ్రా చేయవచ్చు. ఈ కార్డు జారీ చేయడానికి ఫీజు రూ.100, వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు రూ.175 చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఎన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.40 వేలు డ్రా చేయవచ్చు. ఈ కార్డుకు సంవత్సరానికి రూ.175 చెల్లిస్తుండాలి.

ఎస్ బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్డు ద్వారా రోజుకు రూ.40 వేలు తీసుకోవచ్చు. ఈ కార్డు ఫ్రీగా దొరుకుంది. కాకపోతే దీని మెయింటెనెన్స్ చార్జీలు రూ.175 కడుతూ ఉండాలి. ఇక లాస్ట్ కార్డు ఎస్ బీఐ మై కార్డు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా రూ.40 డ్రా చేయవచ్చు. కానీ ఈ కార్డు కోసం రూ.250 కట్టాలి. సంవత్సరానికి కార్డు మెయింటనెన్స్ చార్జీలు రూ.175 కడుతూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news