ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై వర్మ ట్వీట్..!?

-

ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సినీ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో నిరీక్షణగా ఎదురుచూస్తున్నారు.. కనీసం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన కాస్తయినా సంతృప్తి చెందుదాం అనుకుటనున్నారు.. అయితే మామూలుగానే జక్కన్న సినిమాలు అంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగులు మొదలు కాలేదు కాబట్టి ఈ సినిమాకు టైం ఇంకా ఎక్కువ పడుతుంది.

ఇలాంటి క్రమంలో తాజాగా రాజమౌళి సినిమాల ఆలస్యంపై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ చురకలు అంటిస్తూ ఒక ట్విట్ పెట్టాడు. హే రాజమౌళి ప్రపంచమంత ఆన్లైన్లోకి మారిపోయింది… అదే ప్రస్తుతం సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్… ప్రస్తుతం ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి.. మేమంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బులు ఇచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ కామెంట్ పై రాజమౌళి ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news