తెరపైకి ఆర్టికల్ 197(2)(బి)… ఎవరికి ప్లస్?

-

గడిచిన రెండు మూడు రోజులుగా ఏపీలో అత్యంత సంచలన విషయంగా మారింది.. గవర్నర్ వద్దనున్న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు! శాసనమండలిలో నెలరోజులు నానిన కారణంతో “డీండ్ టు బి పాస్డ్” పద్దతిలో గవర్నర్ ఆమోదం పొందొచ్చని వైకాపా నాయకులు, ఏపీ ముఖ్యమంత్రి భావిచారు! అయితే… ఈ బిల్లులో కొన్ని కీలక విషయాలు కేంద్రంలోని అంశాలతో ముడిపడి ఉండటం వల్ల… రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా పంపాల్సి వస్తోందని మరో మాట వినిపిస్తుంది. దీంతో… ఏపీ ప్రభుత్వానికి కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది అన్న మాటలు వినిపించాయి! ఈ క్రమంలో ఊహించని రీతిగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 197(2)(బి) తెరపైకి వచ్చింది!

ఈ విషయంలో గవర్నర్ వద్ద నున్న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ఆమోదిస్తారని భావిస్తున్నామని బలంగా చెబుతున్నారు రాజ్యాంగ నిపుణులు! ఏపీ శాసన సభలో ఇప్పటికే రెండు సార్లు ఆమోదం పొందిన ఈ బిల్లు.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం ఆమోదం పొందినట్లుగా భావిస్తారని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటి ప్రొవిజన్ ఒకటి రాజ్యాంగంలో ఉందనేది ఆయన వాదన! మరి ఇదే నిజమైతే ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు… మండలి విషయంలో “డీండ్ టు బి పాస్డ్” కి అనుకూలంగా మారిన బిల్లు కచ్చితంగా ఆమోదం పొందే అవకాశం ఉందనే వాదనకు బలం చేకూరినట్లే!!

కాగా.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించగా… ఈ రెండుసార్లూ శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది టీడీపీ. ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా… అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్‌ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేసిన సంగతీ తెలిసిందే!!

Read more RELATED
Recommended to you

Latest news