ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 1.24 పైసలు, డీజిల్‌పై 0.93 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ నేపథ్యంలోనే ధరలు పెంచుతున్నామని రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాది 1,323 కోట్లకు పడిపోయిందని వెల్లడించారు.
జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని భార్గవ్ తెలిపారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం తెలిపింది. కాగా, కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.