ఇవాళ ఆన్‌లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ జరగనుంది. రూరల్ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఎలా నిర్వహిస్తారో కోర్టుకు ప్రభుత్వం వివరించనుంది. అలాగే ఆన్‌లైన్ తరగతుల స్క్రీన్ టైం ఎంత వుండాలి, తరగతులలో బోధించే సిలబస్ గురించి కోర్టుకు ప్రభుత్వం తెలపనుంది. అంతేకాకుండా ఆన్‌లైన్ క్లాసెస్‌కు సంబంధించి సమగ్ర పాలసీ విధానాన్ని ఇవాళ కోర్టుకు ప్రభుత్వం సమర్పించనుంది.
అయితే గతంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టు విచారణ జరపగా.. రాష్ట్రంలో కాలేజీలు, స్కూళ్లకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయమై సమగ్ర విధానాన్ని రూపొందించి హైకోర్టుకు నివేదిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూలై 31వ తేదీ వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.