ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు కరోనా కేసులు మాత్రం ఎక్కువైపోతున్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రణ లో జగన్ సర్కార్ ఎంతో నిబద్ధతతో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల విషయంలో ఫలితాల విషయంలో వైద్యం విషయంలో ఎన్నో చర్యలు చేపట్టింది.
ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ చికిత్స కోసం అదనంగా మరో వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు ఈ సమీక్షలో వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా వచ్చి ఆరు నెలలకు గాను వైద్య సిబ్బందిని పారామెడికల్ సిబ్బందిని నియామకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 6.5 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… మరో 50 హాస్పిటల్లను కరోనా చికిత్స కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు