కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. ఓపెన్ స్కూల్ విద్యార్థులు అందరూ పాస్..?

-

కరోనా వైరస్ కారణంగా కొంతమంది విద్యార్థులకు మంచి జరుగుతుంది… ఇంకొంత మంది విద్యార్థులకు మాత్రం చెడు జరుగుతుంది. బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి… కరోనా వైరస్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో అందరితో పాటే మార్కులు వచ్చాయి. కాని కొంత మందివిద్యార్థులు పరీక్షలు రాసిన పాస్ అవుతామో లేదో అనుకున్న వారికి మాత్రం కరోనా ద్వారా అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాలి… అందరూ కూడా పరీక్షల రద్దుతో పాస్ అయిపోయి గట్టెక్కారు.

అయితే మొన్న 10 పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కారు… తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో… ఓపెన్ స్కూల్ విద్యార్థులు అందరికీ ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రతి సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ స్కూల్ విద్యార్థులు పదో తరగతిలో 35 వేల మంది ఉండగా.. ఇంటర్లో 43 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ పది, ఇంటర్ పరీక్షల రద్దుతో పాస్ అయ్యారు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో వీళ్లందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news