ఈ అప్పడాలు తింటే కరోనాను జయించే యాంటీబాడీస్ తయారవుతాయంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఓ కొత్త అప్పడాల బ్రాండ్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను తయారుచేసే పదార్థాలు ‘బాబ్జీ’ అప్పడాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని చేపట్టిన తయారీదారులను తాము అభినందిస్తున్నామని ప్రశంసించారు.
Union Minister Arjun Ram Meghwal has launched a 'papad' brand amid crisis claiming that it contains some ingredients that help develop antibodies against Covid-19.#Covid19 pic.twitter.com/rd3dVx6WI1
— Newsd (@GetNewsd) July 24, 2020
తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు చెందిన కంపెనీ పేర్కొంది . కాగా, మహమ్మారిపై పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అర్జున్‌రామ్ మేఘ్వాల్‌పై సుమోటోగా చర్యలు చేపట్టాలని ఈ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ కోరారు. అలాగే దీనిపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు.