టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి బెయిల్ పిటీషన్ ని ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. ఈఎస్ఐ మందుల అవకతవకలకు సంబంధించి ఆయనను ఏసీబీ రెండు నెలల క్రితం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఆయన ఏసీబీ కస్టడీ లోనే ఉన్నారు. ఏసీబీ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఆయనతో పాటుగా ఈ కేసులో ఏ 1 గా ఉన్న రమేష్ కుమార్ కూడా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.
ఆయనతో పాటుగా సుబ్బారావు, మాజీ మంత్రి పితాని పిఏ మురళి బెయిల్ పిటీషన్ ని కూడా ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. ఇప్పటికే అచ్చెన్నను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇప్పుడు అనారోగ్య సమస్యతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొన్న ఈ పిటీషన్ కి సంబంధించి వాదనలు పూర్తి కాగా నేడు దీనిపై తీర్పుని ధర్మాసనం వెల్లడించింది.