పార్లమెంట్ భవనం కూల్చేస్తామని కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. భవనం అవసరాలకు సరిపోవడం లేదని, సాంకేతికత లేదు అని చెప్తూ కూల్చి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని చెప్పింది కేంద్రం. సుప్రీం కోర్ట్ లో కేంద్రం ఒక అఫిడవిట్ ని కూడా ఈ మేరకు దాఖలు చేసింది.
ప్రస్తుత పార్లమెంట్ భవనం 1921 లో కట్టడం మొదలు పెట్టి 1937 లో పూర్తి చేసారు అని, ఇప్పటికే వందేళ్ళు దాదాపుగా పూర్తి అయింది అని కేంద్రం పేర్కొంది. దీని వలన భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సుప్రీం కోర్ట్ కి కేంద్రం చెప్పింది. భవనంలో ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని కేంద్రం సుప్రీం కోర్ట్ కి పేర్కొంది. ఇదే స్థలంలో నూతన భవన నిర్మాణం చేపడతామని కేంద్రం పేర్కొంది.