నోకియా 65 ఇంచుల 4కె ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ధ‌ర ఎంతంటే..?

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, నోకియా కంపెనీలు క‌లిసి ఆండ్రాయిడ్ టీవీల‌ను త‌యారు చేసి విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ కంపెనీలు తాజాగా మరొక టీవీని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేశాయి. ఇప్ప‌టికే నోకియాకు చెందిన 43, 55 ఇంచుల సైజ్ ఉన్న టీవీలు మార్కెట్‌లో అందుబాటులో ఉండ‌గా, ప్ర‌స్తుతం 65 ఇంచుల 4కె టీవీని ఆ కంపెనీలు విడుద‌ల చేశాయి. దీంతో తాజాగా విడుద‌ల చేసిన టీవీ మూడ‌వ‌ది కావ‌డం విశేషం.

nokia 65 inch 4k tv launched in india

నోకియా 65 ఇంచుల 4కె టీవీలో 3840 × 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్ ల‌భిస్తుంది. డాల్బీ విజ‌న్‌, ఇంటెలిజెంట్ డిమ్మింగ్ ఫీచ‌ర్లు ఈ టీవీ డిస్‌ప్లేకు ఉన్నాయి. 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెస‌ర్‌, 2.25 జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఓఎస్ ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, ఈథ‌ర్‌నెట్ స‌దుపాయాలు ఉన్నాయి.

24 వాట్ల బాటమ్ ఫైరింగ్ స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. అవి జేబీఎల్ కంపెనీ స్పీక‌ర్లు కావ‌డం విశేషం. అలాగే డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ స‌రౌండ్ ఫీచ‌ర్లు ఈ టీవీలో ఉన్నాయి.

నోకియా 65 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.64,999గా ఉంది. ఆగ‌స్టు 6 నుంచి ఈ టీవీని ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news