ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటాం: కేటీఆర్

-

లక్షల మంది కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే పార్టీ గొప్పగా ముందుకెళ్తోందని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కార్యకర్తల బీమా కోసం బీమా కంపెనీలకు ప్రీమియం చెక్కులు అందజేశారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలను అధిగమించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సంకల్ప బలం, ముహుర్తం వల్లే పార్టీ అజేయశక్తిగా ఆవిర్భవించిందన్నారు. కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించడం సంతోషంగా ఉందన్న కేటీఆర్​… కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.

Ktr 

60 లక్షల మంది కార్యకర్తల ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్ల ప్రీమియం చెక్కులు… బీమా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్​ అందజేశారు. ఇప్పటివరకు కార్యకర్తల బీమా కోసం రూ.47.65 కోట్లు చెల్లించినట్టు వివరించారు. కార్యకర్తల సంక్షేమానికి మరికొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తామని వెల్లడించారు. ఏ ఒక్క కార్యకర్త కష్టంలో ఉన్నా కుటుంబసభ్యుడిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా కార్యకర్తలు నడుచుకోవాలని కోరారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణం 90 శాతం పూర్తైనట్టు వివరించారు.కరోనా పరిస్థితుల వల్ల కార్యకర్తల శిక్షణ వాయిదా వేసినట్టు కేటీఆర్​ తెలిపారు.

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండేలా కార్యకర్తలను తీర్చిదిద్దుతామన్నారు. కేసీఆర్​ ముహూర్త బలం వల్ల మరో వందేళ్లు పార్టీ బలంగా ఉండేలా… ఏ పార్టీకి లేని యంత్రాంగం టిఆర్ఎస్ కు ఉందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అంబులెన్స్​లు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్​ను విమర్శించే ముందు కాంగ్రెస్, బీజేపీ ఒకసారి ఆలోచించాలన్న కేటీఆర్​… పీసీసీ, బీజేపీ నేతలకు ముందు టీ వచ్చిందంటే టిఆర్ఎస్ పుణ్యమేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news