తూర్పు లద్దాఖ్ సరిహద్దులో భద్రతను మరింత పెంచింది భారత్. దౌలత్ బేగ్ ఓల్దీ(డీబీఓ), దేప్సంగ్ మైదానాల్లో భారీగా బలగాలను మోహరించింది. హెవీ ట్యాంకర్లను తరలించింది. చైనా సైన్యం కవ్విస్తే దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాంతాల్లో ఏప్రిల్ – మే నుంచి 17 వేల బలగాలను చైనా మోహరించింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. పెట్రోలింగ్ పాయింట్ 10, 13 పాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించడానికి వీల్లేకుండా అడ్డుకుంది.
ఇక ఈ నేపథ్యంలోనే చైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా 15 వేలకు పైగా బలగాలు, భారీ ఆయుధ వాహనాలు మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒక వేళ చైనా తెగిస్తే భారత్ చేతిలో చావు దెబ్బ తప్పదని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాయి. డీబీఓ సెక్టార్కు ఎదురుగా ఉన్న టీబడ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారాకోరం పాస్ ఏరియా వరకు రోడ్డు నిర్మించాలని భావిస్తోంది ఛైనా. అందుకే అక్కడి నుంచి సైనికులను ఉపసంహరించుకోవడంలేదు.