రానాకు విషెస్ చెప్పిన అక్షయ్ కుమార్

-

టాలీవుడ్ యంగ్ హీరో రానా మరికొద్ది సేపట్లో తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేయనున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌తో శనివారం రాత్రి 8:30 గంటలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, టాలీవుడ్ హీరో రానాకి మధ్య మంచి స్నేహం ఉంది. అక్షయ్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘బేబీ’లో రానా అతిథి పాత్ర చేశారు. అప్పుడే ఈ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

rana
rana

అక్షయ్‌కుమార్, రానా సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ‘పోస్టర్ బాయ్స్’. మరాఠీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పోస్టర్ బాయ్స్’ని అదే పేరుతో తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ – తెలుగు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌ని బాగా ఇష్టపడతారని తెలుసు. అందుకే, రానాతో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన`ని అక్షయ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news