మన దేశంలో కాస్త భక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగి… అది భక్తితో లింక్ ఉంటే చాలు దాని గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కడైనా తవ్వకాలు జరిపిన సమయంలో అక్కడ ఏదైనా విగ్రహం దొరికింది అంటే చాలు దానికి సంబంధించి జరిగే ప్రచారం అంతా ఇంత కాదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కొండ పై అయ్యప్ప విగ్రహం దొరకడం ఇలాగే సంచలనం అయింది.
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలోని కొండపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వర్షాలు పడుతుండటం తో పుట్టగొడుగుల కోసం వెళ్ళారు. అక్కడ వారు తవ్వకాలు జరిపారు. ఈ సమయంలోనే అయ్యప్ప స్వామి విగ్రహం ఒకటి కనపడింది. దీనితో అందరూ షాక్ అయ్యారు. ఆ విగ్రహం కూడా నీలి రాతి విగ్రహం. దీనితో అయ్యప్ప ఇక్కడ వెలిశారు అంటూ పూజలు మొదలు పెట్టారు అక్కడి స్థానికులు.