కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (14-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌‌‌‌వారం (14-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 14th august 2020

1. దేశంలో కొత్త‌గా 64,553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 24,61,191కి చేరుకుంది. 6,61,595 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 17,51,556 మంది కోలుకున్నారు. మొత్తం 48,040 మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి.

2. తెలంగాణ‌లో కొత్త‌గా 1921 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 64,284 మంది కోలుకున్నారు. 674 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

3. అమెరికాలో క‌రోనా వ్యాక్సిన్ న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో అందుబాటులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఇప్ప‌టికే స్పుత్‌నిక్-వి పేరిట క‌రోనా వ్యాక్సిన్‌ను విడుద‌ల చేయ‌గా.. అంద‌రి దృష్టి ఇప్పుడు అమెరికాపై ప‌డింది. అయితే అక్క‌డ వ్యాక్సిన్ వ‌చ్చేందుకు న‌వంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

4. కోజికోడ్ విమాన ప్ర‌మాదంలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న 22 మంది అధికారుల‌కు క‌రోనా సోకింది. వారికి టెస్టులు చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయింది. వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా దుబాయ్ నుంచి వ‌చ్చిన విమానం కేర‌ళ‌లోని కోజికోడ్‌లో ప్ర‌మాదానికి గుర‌వ‌గా అందులో 18 మంది చ‌నిపోయారు.

5. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డి ఆగ‌స్టు 5 నుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్ర‌వారం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. దీంతో ఆయ‌న‌కు లైఫ్ సపోర్ట్‌తో వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు.

6. క‌రోనా బారిన ప‌డిన భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఆయ‌న ఆరోగ్యం ఇంకా మెరుగుప‌డ‌లేద‌ని హాస్పిట‌ల్ తెలిపింది. ఆయ‌న వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు.

7. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు క‌రోనా నెగెటివ్ అని నిర్దార‌ణ అయింది. గ‌త కొద్ది రోజుల కింద క‌రోనా బారిన ప‌డ్డ ఆయ‌న హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. తాజాగా ఆయ‌న టెస్టు చేయించుకోగా అందులో ఆయ‌నకు కోవిడ్ నెగెటివ్ అని తేలింది.

8. ఏపీలో కొత్త‌గా 8,943 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,73,085కు చేరుకుంది. 89,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,80,703 మంది కోలుకున్నారు. 2475 మంది చ‌నిపోయారు.

9. క‌రోనా వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ముందుగానే గుర్తించి వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంద‌ని భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌కు సందేశం ఇచ్చారు. క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

10. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,890 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,26,245కు చేరుకుంది. 53,716 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5514 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news