వినాయక చవితి వేల కేటీఆర్ పిలుపు.. ఈ సారి అందరూ..!

-

వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి వినాయక విగ్రహాన్ని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్‌కు అందజేశారు. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఎవరి ఇళ్లల్లో వారు నిర్వహించుకోవాలని ప్రలజకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంతో రూపొందించే వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా హెచ్ఎండిఏ గత ఎనిమిది సంవత్సరాలుగా సాంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news