అజ్ఞాతంలో ఉన్న రమేష్ హాస్పటల్ అధినేత డా. రమేష్… తాజాగా తమవైన మీడియా ఛానల్స్ కు ఒక ఆడియో సందేశం పంపారు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న విషయం నుంచి తప్పించుకోవడానికో.. లేక ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగానో తెలియదు కానీ… విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని లీగల్ అడ్వైజర్స్ చెప్పారని చెప్పుకొస్తున్నారు!
ప్రమాదం రోజు కలెక్టరేట్ లో విచారణకు హాజరయిన అనంతరం… డాక్టర్ రాజగోపాల్, సుదర్శన్ లను నిర్భందించారని తెలిసి.. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని లీగల్ అడ్వైజర్స్ చెప్పడం వల్ల అధికారులు విచారణకు పిలిచే వరకు వేచి ఉండాలని తనకు సూచించారని.. నిష్పక్షపాతంగా న్యాయ విచారణకు తాను సిద్ధంగా ఉన్నామని చెప్పుకొస్తున్నారు రమేష్!
ఆ సంగతులు అలా ఉంటే… తనను రమేష్ బాబు అనకుండా… రమేష్ చౌదరి అని సంభోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రమేష్ హాస్పటల్ అధినేత డా. రమేష్. కళకి, వైద్యానికి కులం ఉండదని చెప్పుకొస్తున్నారు. వైద్యవృత్తి చాలా గొప్పదని.. ఆ వృత్తికి కూడా కులాన్ని ఆపాదించొద్దని అంటున్నారు. మరి… వైద్య వృత్తి అంత గొప్పదే అయితే… కరోనా భయం ఉన్న వారిలో మరింత భయం కల్పించి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాకపోయినా.. లక్షలకు లక్షలు వసూళ్ చేసి ఎందుకు ధానాపేక్షకోసం వైద్య వృత్తిని వాడుకుంటున్నారో చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి!
అంతవరకూ బాగానే ఉండి ఉండొచ్చు కానీ.. ఈ సమయంలో 10మంది మృత్యువాతపడితే.. టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఫైరయిపోవాలి. విశాఖ గ్యాస్ లీక్ వ్యవహారంలో చూపించిన ఉత్సాహం, చేసిన విమర్శలు ఇప్పటికే చాలా చేసి ఉండాలి. మరి అన్ని ప్రాణాలు పోయినా కూడా… అలాంటి ఘటన జరగడంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తంచేస్తున్నట్లుగా ట్విట్లు పెట్టడం మినహా… వారు సాధించిందేమిటి? అందుకు కారణం ప్రజలపై టీడీపీ నేతలకు ప్రేమ లేకపోవడమా.. రమేష్ హాస్పటల్ పై అధిక ప్రేమ ఉండటమా అనేది డా. రమేష్ బాబే చెప్పాలి అని అంటున్నారు నేటిజన్లు!!