పేదల జీవితాలను మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఏపీ సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం, శకటాలను వీక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకల్లో సిఎం తో పాటుగా డీజీపీ గౌతం సవాంగ్ కూడా పాల్గొన్నారు. సామాజిక ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు అందరికి సమానంగా అందాలని సిఎం పేర్కొన్నారు.
సమానత్వం పదాన్ని పుస్తకాలకు పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదన్నారు జగన్. అంటరానితనం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికి సంక్షేమ ఫలాలు అందాలని ఆయన స్పష్టం చేసారు. అందరూ రాజ్యాంగం, చట్టం ప్రకారం నడవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా అవకాశాలకు దూరం కాకూడదు అన్నారు ఆయన.