జగన్ బాటలో కేసీఆర్.. కొత్తగా వార్డు ఆఫీసర్లు !

-

ఏపీ సీఎం జగన్ గర్వంగా చెప్పుకునే అంశం ఏదయినా ఉందా అంటే అది గ్రామ, వార్డ్ వాలంటీర్లు అని చెప్పచ్చు. ఈ విషయాన్ని ఐక్య రాజ్య సమితి కూడా గుర్తించిందని ఆ ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్ బాటలోనే తెలంగాణా ప్రభుత్వం నడవనున్నట్టు చెబుతున్నారు. కొత్తగా వార్డు అఫీసర్లని నియమిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధులుగా ఉండేలా వార్డు అఫీసర్ల నియామకం చేపడతామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో వార్డు అఫీసర్లను నియమిస్తామని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని ఆయన అన్నారు. ఇక దేశంలోనే మెదటి సారిగా వార్డుకు ఒక అధికారి నియామకం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని, ఖాళీల భర్తీకి ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందని మంత్రి పేర్కొన్నారు. పౌరుడే కేంద్రంగా పౌర సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, పట్టణాల క్రమానుగత అభివృద్ధికి ఈ ఖాళీల భర్తి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వీలవుతుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news