శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయాలు ప్రకటించారు. మరణించిన డిఇ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షలు, మిగతా వారందరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.
మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, అలానే ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించారు. అయితే జెన్ కో హాస్పిటల్ లో మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. Ae కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం మీద అసహనం వ్యక్తం చేస్తూ వారు మార్చురీ ఎదురుగా బైటాయించారు. ఒక్కోక్కరికి కోటి రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా అని హామీ ఇచ్చేవరకు బాడీలు తీసుకెళ్లమంటూ ఆందోళనకు దిగారు.