కాంగ్రెస్‌కు మాజీమంత్రి బాల్‌రాజ్‌ గుడ్‌బై

-

Former minister balraj goodbye to congress party
విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లోకి

విశాఖ: కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించే అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాలరాజు పనిచేశారు. తన 25వ ఏట మండల స్థాయి నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. బాలరాజు తదుపరి కార్యాచరణ ఏమిటో ఇంకా ప్రకటించక‌పోయినా విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్న‌ట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news