అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని ప్రకటించిన పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చింది. దావూద్ తమ దేశంలో లేడని తాజాగా పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దావూద్ పాకిస్తాన్లో ఉన్నాడన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. దావూద్ కరాచీలో ఉన్నాడంటూ భారత మీడియా ప్రకటించిందని, దానిలో ఏమాత్రం నిజం లేదని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దావూద్ పాకిస్తాన్లో ఉన్నట్లు అనేక సందర్భాల్లో ప్రపంచానికి ఆధారాలు వచ్చాయి. కానీ పాకిస్తాన్ ప్రతిసారీ దానిని నిరాకరిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే ఈసరి కూడా మాట మార్చింది. కాగా దావుద్ 1993 ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రదారి. ముంబై పేలుళ్ల తర్వాత ఆయన, ఆయన కుటుంబం పాకిస్తాన్ పారిపోయారు. భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో దావూద్ పేరు ఉంది. ఇకపోతే ఎఫ్ఎటిఎఫ్ నిఘా జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దావూద్ ఇబ్రహీం పేరు ఉంది.