ఏపీ సియం జగన్ కు యంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. అందులో పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వెయ్యాలని కోరారు. కరోనా మహమ్మారి ఇంకా రాష్ట్రంలో తగ్గుముఖం పట్టలేదని అన్నారు. ఈ సమయంలో పాఠశాలలు తెరవడం వల్ల పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని , ప్రాణహాని ఉందని తల్లితండ్రులు భయబ్రాంతులకు గురువవుతున్నారని అన్నారు. రోజుకు పది వేలు కరోనా కేసులు నమోదు అవుతున్న తరుణంలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించడం మంచిది కాదని ఆయన అన్నారు.
చిన్న పిల్లలకురోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పిల్లలకు కరోనా సోకినా, మృత్యువాత పడినా మీకు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. మన ప్రభుత్వం పాఠశాలలు బాగుచెయ్యాలని నాడు- నేడు, అమ్మఒడి, పిల్లలకు జగనన్న గోరు ముద్ద వంటి ఎన్నో మంచి పధకాలను ప్రవేశ పెట్టిందని పాఠశాలలు ప్రారంభించే అంశం పై అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పిల్లలు తల్లి తండ్రుల మనోభావాలు, పిల్లల ఆరోగ్యం పట్ల వారి ఆందోళను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 5 వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం వాయిదా వెయ్యాలని ఆయన కోరారు.