నన్ను అల్లరి చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన

-

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అని వైసీపీ కార్యకర్తలే కోర్టులో కేసు ఫైల్ చేయడంపై ఇప్పుడు అధికార పార్టీ నేతలు కూడా ఆసక్తిగా చర్చిస్తున్నారు. అంబటి మీద ఎవరికో కక్ష ఉంది కాబట్టే ఈ విధంగా ఆయనపై కేసు పెట్టారని ఆయనకు అండగా నిలుస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను అంబటి ఖండించారు. ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యలు చేసారు.

ambati-rambabu
ambati-rambabu

అక్రమ మైనింగ్ కు ప్రయత్నం చేసి విఫలమైన వారే, పిల్ వేసి నన్ను అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై మా వ్యతిరేక మీడియా, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడే ప్రశ్నయే లేదన్నారు ఎమ్మెల్యే. వాస్తవాలు నిదానంగా బయటకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news