జ‌న‌సేన‌లో చేరిన మాజీ మంత్రి బాల‌రాజు

-

Former minister balaraju joins in janasena party
*కండువా క‌ప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

విజయవాడ:మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. జనసేన కండువా కప్పి పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్‌‌‌కు ఇటీవల రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరడం వెనుక సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక విలువలున్న నేతలు జనసేనలోకి రావాలి ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2014లో టీడీపీకి మద్దతిచ్చానని మరోసారి ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ పోర్టు అడ్డాగా మైనింగ్‌ జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనం పాటించడం బాధాకరమన్నారు. మైనింగ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చేసిన తప్పు టీడీపీ కొనసాగించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు తప్పులన్నీ తెలసి కూడా సైలెంట్‌గా ఉన్నారంటే అర్థమేంటి..? ఎందుకలా ఉన్నారో అర్థం కావట్లేదని పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌పై బాల‌రాజుకు పూర్తి అవగాహ‌న ఉంద‌ని, గిరిజ‌నుల అభివృద్దికి జ‌న‌సేన క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news