కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (28-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌‌వారం (28-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 28th august 2020

1. భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్ కు క‌రోనా సోకింది. ఆమె ఈ విష‌యాన్ని స్వ‌యంగా తెలియ‌జేసింది. కాగా వినేష్ ఫోగాట్ ఇటీవ‌లే భార‌త అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం రాజీవ్ ఖేల్ ర‌త్న‌కు ఎంపికైంది. అయితే త‌న‌కు బాగానే ఉంద‌ని, క‌రోనాను జ‌యిస్తాన‌ని తెలిపింది.

2. ఏపీలో కొత్త‌గా 10,526 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,03,616కు చేరుకుంది. 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,03,711 మంది కోలుకున్నారు. 3714 మంది చ‌నిపోయారు.

3. సెప్టెంబ‌ర్ నెల‌లో పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో కేంద్రం అన్ని జాగ్ర‌త్త‌ల‌నూ తీసుకుంటోంది. పార్ల‌మెంట్‌కు వ‌చ్చే వారు అంద‌రూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. స‌మావేశాలు ఆరంభం అయ్యేందుకు 72 గంట‌ల ముందుగా టెస్టులు చేయించుకోవాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.

4. దుబాయ్ లో ఐపీఎల్ కోసం వేచి చూస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైంది. 12 మంది స్టాఫ్‌తోపాటు ఒక బౌల‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో వారిని క్వారంటైన్‌లో ఉంచారు.

5. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశాయి. పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, రాజ‌స్థాన్, చ‌త్తీస్‌గ‌డ్‌, పంజాబ్‌, మ‌హారాష్ట్రల నుంచి ఆరుగురు మంత్రులు ఒకేసారి పిటిష‌న్ వేశారు.

6. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ) తెలిపింది. ఈ మేరకు ఒక‌ ప్రకటన వెలువరించింది. మాస్కు ధ‌రిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది.

7. క‌రోనా నేప‌థ్యంలో ఆదాయం లేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్న కేర‌ళ‌లోని 1248 ఆల‌యాలు బంగారాన్ని తాక‌ట్టు పెట్టి లోన్లు తీసుకునేప‌నిలో ఉన్నాయి. ఆ ఆల‌యాల్లో శ‌బ‌రిమ‌ల ఆల‌యం కూడా ఉంది.

8. క‌రోనాను ఈ ఏడాదే అంతం చేస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. క‌రోనాకు మెరుగైన వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తున్నామ‌ని, అమెరికా ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

9. దేశంలో కొత్త‌గా 77,266 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 33,87,501కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే 1057 మంది చనిపోయారు. 7,42,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 25,83,948 మంది కోలుకున్నారు.

10. తెలంగాణ‌లో కొత్త‌గా 2,932 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,17,415కి చేరుకుంది. మొత్తం 799 మంది చ‌నిపోయారు. 87,675 మంది కోలుకున్నారు. 28,941 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news