కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లు ఓపెన్.. సోమవారం నుండే..

-

కరోనా వచ్చి అన్ని రంగాలని అతలాకుతలం చేసేసింది. ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఇదీ అదీ అని కాకుండా అన్నింటి మీదా ఎఫెక్ట్ పడింది. ఐతే ప్రస్తుతం దేశమంతా అన్ లాక్ దశలో ఉంది. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. అన్నింటినీ మూసేసి కూర్చుంతే ఆకలి చావులు ఎక్కువవుతాయన్న నేపథ్యంలో ప్రభుత్వం మెల్ల మెల్లగా అన్ లాక్ ప్రక్రియని తీసుకువచ్చింది. సెప్టెంబర్ నుండి పూర్తి అన్ లాక్ దశలోకి వెళ్లిపోతున్నామని అంటున్నారు.

 


అదలా ఉంచితే తాజాగా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లు తెరుచుకుంటున్నాయి. అనేక నిబంధనల నడుమ ఈ క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ మేరకు క్యాంటీన్ సిబ్బందికి నియమ నిబంధనలు జారీచేసారు. ఫుడ్ విషయంలోనూ, శుభ్రత విషయంలోనూ, ఎక్కడా చిన్న తప్పు కూడా దొర్లకూడదని చెప్పారట. భౌతిక దూరం పాటిస్తూ, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారట. సోమవారం నుండి ఈ క్యాంటీన్లు మళ్లీ కళకళ లాడనున్నాయి. ఐతే అది కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సుమా..

Read more RELATED
Recommended to you

Latest news