రైల్వే రిక్రూట్‌మెంట్ 2020: ఖాళీగా ఉన్న పారామెడిక‌ల్ పోస్టులు.. ఇప్పుడే అప్లై చేయండి..

-

సెంట్ర‌ల్ రైల్వే వారు రైల్వేలో ఖాళీగా ఉన్న పారామెడికల్ సిబ్బంది పోస్టుల‌కు నిరుద్యోగ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ సి పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో తీసుకోనున్నారు. అందుకు గాను ఔత్సాహికులు త‌మ అప్లికేష‌న్ల‌ను సెప్టెంబ‌ర్ 2 లోగా [email protected] అనే మెయిల్‌కు పంపాలి.

para medical staff jobs in rrb apply now

రైల్వే రిక్రూట్‌మెంట్ 2020: ఖాళీల వివ‌రాలు

భువ‌నేశ్వ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. న‌ర్స్‌, ఫార్మ‌సిస్ట్‌, ల్యాబ్ టెక్నిషియ‌న్‌, ఎక్స్‌-రే టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* స్టాఫ్ న‌ర్స్ – 26 పోస్టులు
* ఫార్మ‌సిస్ట్ – 3 పోస్టులు
* ల్యాబ్ టెక్నిషియ‌న్ – 10 పోస్టులు
* ఎక్స్‌-రే టెక్నిషియ‌న్ – 9 పోస్టులు

అర్హ‌త వివ‌రాలు

* స్టాఫ్ న‌ర్స్ పోస్టుకు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్ చే గుర్తింపు పొందిన ఏదైనా ఇనిస్టిట్యూట్ నుంచి జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్‌లో 3 ఏళ్ల కోర్సు చేసి ఉండాలి. లేదా బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి.

* ఫార్మ‌సిస్టు పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసే వారు 10 + 2 లేదా దానికి స‌మాన‌మైన కోర్సులో సైన్స్ స‌బ్జెక్టుతో పాస్ అయి ఉండాలి. లేదా ఫార్మ‌సీ డిప్లొమా చేసి ఉండాలి. బి.ఫార్మ‌సీ చేసిన వారు కూడా అర్హులే.

* ల్యాబ్ టెక్నిషియ‌న్ పోస్టుకు బ‌యో కెమిస్ట్రీ లేదా మైక్రో బ‌యాల‌జీ లేదా లైఫ్ సెన్సెస్‌లో బీఎస్సీ చేసి ఉండాలి. మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా లేదా బీఎస్సీ మెడిక‌ల్ టెక్నాల‌జీ చేసి ఉండాలి.

* ఎక్స్‌-రే టెక్నిషియ‌న్ పోస్టుకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో 10 +2 పాస్ అయి ఉండాలి. అలాగే రేడియోగ్ర‌ఫీలో డిప్లొమా లేదా ఎక్స్‌రే టెక్నిషియ‌న్ లేదా రేడియో డ‌యాగ్న‌సిస్ టెక్నాల‌జీలో కోర్సు చేసి ఉండాలి.

అభ్య‌ర్థుల‌ను వాట్సాప్ వీడియో కాల్ లేదా స్కైప్ కాన్ఫ‌రెన్స్ కాల్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేస్తారు. సెప్టెంబ‌ర్ 4, 10 తేదీల్లో ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news