ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. అప్పట్లో మద్యం వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో రేట్లు విపరీతంగా పెంచడమైతేనేమి, ఇంకా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని మార్చడం అయితేనేమీ.. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా మారుతుంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్ రమ్మీపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారట.
గత కొన్ని రోజులుగా సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి ఊతమిచ్చే ఆన్ లైన్ గేమ్స్ రమ్మీపై నిషేధం విధించాలని అనుకుంటున్నారట. ఆన్ లైన్ రమ్మీ నిరుద్యోగ యువతపై బాగా ప్రభావం చూపుతున్నందున్న బ్యాన్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఈ ఆన్ లైన్ రమ్మీ వల్ల ఇప్పటికే చాలా ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. సో.. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం వేయడమే లక్ష్యంగా నిషేధం విధించనున్నారు. జగన్ సంచలన నిర్ణయాల్లో ఈ నిర్ణయం కూడా ఒకటని చెప్పవచ్చు.