కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకీ దీని ఉధృతి పెరుగుతూనే ఉంది. ఐదున్నర నెలలుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా దీన్ని అదుపు చేయలేకపోతున్నాయి. ఐతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకే విధంగా ఉందా అంటే.. లేదనే చెప్పాలి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉధృతి భయంకరంగా ఉంది. రోజుకి వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మొత్తం 7,80,689 కేసులు కాగా, 5,87141మంది రికవరీ అయ్యారు. ఇంకా 1,93,548కేసులు ఆక్టివ్ లో ఉన్నాయి.
ఐతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి చేరుకుంది. రోజుకి పదివేలకి పైగా కేసులు వెలుగుచూడడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 4,24,767కి చేరుకుంది. తమిళనాడుని(4,22,085) వెనక్కి నెట్టి రెండవస్థానాన్ని ఆక్రమించింది. దీంట్లో 325638మంది రికవరీ అయ్యారు. ఇంకా 99129 ఆక్టివ్ కేసులున్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆక్టివ్ కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో ఉంది.