FLASH : ఇండియాకు జపాన్ 3,500 కోట్ల ఋణ సాయం..!

-

కరోనా మహమ్మారి దెబ్బకి అగ్ర దేశాల నుంచి చిన్న చిన్న దేశాల వరకు అన్నీ తీవ్రంగా నష్టపోయాయి. మన దేశంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆర్ధికంగా కూడా చాలానే నష్టపోయాం. అయితే ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ఇండియాకు 3500 కోట్ల ఋణాన్ని ఇస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సిఎస్ మొహాపాత్ర, భారత్ లోని జపాన్ రాయబారి సుజుకి సతోషి పత్రాలు మార్చుకున్నారు. అంటువ్యాధుల మీద పోరాటానికి భారత ఆరోగ్య వ్యవస్థ ఈ నిధులను ఖర్చు చేయనుంది.

గత కొన్నేళ్ళలో భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారం పటిష్టమై, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ఈ నిధుల వల్ల కరోనాతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం కోవిడ్‌ కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. కోట్లది రూపాయలు ఖర్చు చేసి కరోనాను తరిమి కొట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news