కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం హైదరాబాద్ మెట్రో రైల్ 7వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. దానికి సంబందించిన విధి విధానాలను ఈరోజు ఫైనల్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి ఎల్ & టీ ఎండీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలు గైడ్ లైన్స్ రూపొందించారు. హైదరాబాద్ మెట్రో రైలు సేవలను తిరిగి మొదలు కావడానికి గైడ్లైన్స్ మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్యాసింజర్ లను బట్టి ఫ్రీక్వెన్సీ పై నిర్ణయం తీసుకోనున్నారు.
మెట్రో స్టేషన్ లతో పాటూ రైళ్లలో భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ లో, రైళ్ళలో భౌతిక దూరాన్ని సిసి టీవీల ద్వారా పర్యవేక్షించనున్నారు. అలానే మెట్రో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని, మాస్క్ లేకపోతే పెనాల్టీ విధించనున్నారు. ఇక లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. మెట్రో ఉద్యోగులు అందరూ పిపిఇ కిట్లతోనే పని చేయనున్నారు. క్యాష్ లెస్ విధానంలో టికెట్లు అమ్మనున్నారు. స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు, మొబైల్ క్యూఆర్ టికెట్ ద్వారానే టికెట్స్ తీసుకోవలసి ఉంది.