ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకు ప్రధాని మోదీ విరాళాలు ఇచ్చారు. కరోనా వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు తొలి విరాళం అందజేసింది కూడా ప్రధాని మోదీయే. తన సొంత డబ్బు నుంచి రూ.2.25 లక్షలను ఆయన విరాళమిచ్చారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్‌కు మోదీ వ్యక్తిగతంగా ప్రారంభ విరాళం ఇవ్వడాన్ని కేంద్రమంత్రులు పీయుష్ గోయల్, స్మృతీ ఇరానీ, పలువురు బీజేపీ నేతలు ట్విట్టర్‌లో ప్రశంసించారు.
అదేవిధంగా బాలికల చదువు నుంచి మొదలుకొని నమామి గంగే, పీఎం కేర్స్ ఫండ్‌కు అలా ఇప్పటి వరకు రూ.103 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు మోదీ. ఇకపోతే ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు ఆడిట్ రిపోర్టులో వెల్లడైన సంగతి తెలిసిందే.