ఐదుగురు భారత యువకుల్ని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ ?

-

ప్రస్తుతం సరిహద్దుల విషయంలో భారత్ – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా బలగాలు మొహరించాయి కూడా. ఐదుగురు భారత యువకుల్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పసిఘాట్ వెస్ట్ నియోజకరవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నినాంగ్ ఎరింగ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.

అది కూడా రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ రష్యా, చైనా డిఫెన్స్ మినిస్టర్స్ తో మీటింగ్ లో ఉన్నప్పుడే జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలానే తన నియోజకవర్గానికి చెందిన ఆ ఐదుగురు యువకులను చైనా సైన్యం బారి నుండి వెంటనే విడిపించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఎమ్మెల్యే లేఖ రాశారు. ఇలా చేయడం అంటే చైనా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు భావించాలని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగిందని చైనాకు గట్టి సమాధానం ఇవ్వాలని ఆయన మోడీని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news