రాజధానిలో దారుణం : 90 ఏళ్ల ముసలవ్వపై అత్యాచారం..!

-

దేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మహిళల ఆర్తనాదాలతో దేశం అట్టుడికిపోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు తమ కోరికలు తీర్చుకోవడానికి మరింత నీచానికి దిగజారుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి.. చావుకు సిద్దంగా ఉన్న ముసలవ్వ వరకు ఎవరిని వదలట్లేదు ఈ కామాంధులు. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దారుణమైన ఘటనే ఒకటి జరిగింది. నజఫ్‌గర్ ప్రాంతంలోని ఛావ్లాలో నివాసముంటున్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన 33 ఏళ్ల సోను, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

hyderabad police constable molested his own daughter in law
 

ఆ సమయంలో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు ఈ నీచుడు. అయితే ఆ వృద్ధురాలి అర్థనాదాలు విని అక్కడకు చేరుకున్న స్థానికులు. వెంటనే నిందితుడిని పట్టుకుని  స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిపై సెక్షన్ 376,363 కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆ వృద్ధురాలిని స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించిన డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మనివాల్.

Read more RELATED
Recommended to you

Latest news